ప్రణీతతో రోమాన్స్ చేయనున్న రామ్

  • April 11, 2018 / 11:10 AM IST

రామ్ కథానాయకుడిగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న విషయం తెలిసిందే. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ మునుపటి చిత్రమైన “ఉన్నది ఒకటే జిందగీ”లోనూ అనుపమ కథానాయిక అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో మరో కథానాయికగా కన్నడ బ్యూటీ ప్రణీతను ఎంపిక చేసినట్లు తెలిసింది. సెకండ్ హీరోయిన్ గా నటించడంలో దిట్ట అయిన ప్రణీత ఈ చిత్రంలో మరోమారు తన సొగసుల సత్తా చూపనుందట.

మోడ్రన్ గర్ల్ గా ప్రణీత పాత్ర సినిమాకి మంచి గ్లామర్ డోస్ ఇస్తుందని తెలుస్తోంది. మామా-అల్లుళ్ళ నడుమ సరదా పోరుగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి “సినిమా చూపిస్తా మావ, నేను లోకల్” చిత్రాలకు రైటర్ గా వర్క్ చేసిన ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే-మాటలు సమకూర్చడం విశేషం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ నుంచి ప్రణీత జాయిన్ అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus