ఇండియన్ స్పైగా రాధికా ఆప్టే.!

  • April 16, 2018 / 08:56 AM IST

సౌత్ హీరోల మీద, సౌత్ ఇండస్ట్రీ మీద కామెంట్స్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో ఎప్పుడు హైలైట్ అవుతుండే రాధిక ఆప్టే మంచి నటి అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఆమె కొందరు హీరోలు, దర్శకనిర్మాతల కారణంగా ఎదుర్కొన్న సమస్యలు ఆమెను తెలుగు చిత్రసీమ నుంచి దూరం చేశాయి. బాలీవుడ్ లో విరివిగా సినిమాలు చేస్తోంది. అయితే.. కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయింది. అలాగే.. హీరోయిన్ గానూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

అయితే.. అమ్మడికి ఇటీవల ఒక హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. దేవ్ పటేల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న హాలీవుడ్ ఫిలిమ్ లో రాధిక ఆప్టే కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే మరో హాలీవుడ్ సినిమా సైన్ చేసింది రాధిక. రెండో ప్రపంచ యుద్ధం నేపధ్యంలో తెరకెక్కనున్న ఓ హాలీవుడ్ చిత్రంలో రాధిక ఇండియన్ స్పై పాత్ర పోషించబోతోంది. నూర్ ఇనాయత్ ఖాన్ అనే ముస్లిం స్పై పాత్రలో రాధిక ఆ హాలీవుడ్ సినిమాలో నటించబోతోంది. ఈ హాలీవుడ్ సినిమాల తర్వాతైనా రాధికకు తమిళం లేదా హిందీలో మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus