టీచర్ పాత్ర రేజీనాకి కలిసొస్తుందా..?

  • February 12, 2019 / 02:55 PM IST

టాలీవుడ్ లో యువ హీరోలు సరసన నటించి క్రేజ్ సంపాదించుకుంది రెజీనా. అయినప్పటికీ పెద్ద అవకాశాలైతే… ఏమీ రాలేదనే చెప్పాలి. దీంతో కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా ఓ రేంజ్లో అందాల ఆరబోతల చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే నటన పరంగా రేజీనాకి మంచి పేరు మాత్రం ఉంది. ఇక తాజాగా కోలీవుడ్లో నటిస్తున్న ‘కళ్లపార్ట్‌’ చిత్రం పా చాలా ఆశలు పెట్టుకుంది రెజీనా. ఈ చిత్రంలో అరవిందస్వామికి జంటగా నటిస్తోంది.

‘మూవింగ్‌ ఫ్రేమ్స్‌’ బ్యానర్ పై ఎస్‌.పార్తీ,ఎస్‌.శీనా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథనం, దర్శకత్వ బాధ్యతలను పీ.రాజపాండి నిర్వహిస్తున్నాడు. గతంలో ‘ఎన్నమో నడక్కుదు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు రాజపాండి. ఇక ఈ చిత్రంలో రెజీనా డ్యాన్స టీచర్‌గా కనిపించనుంది. కచ్చితంగా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని రెజీనా భావిస్తోందట. ఇదిలా ఉండగా బాలీవుడ్‌లో అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఏక్‌ లడఖీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రంలో లెస్బియన్‌ గా నటించింది రెజీనా. సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో.. సోనమ్ ప్రియురాలిగా రెజీనా నటించింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. రెజీనా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus