మాట వెనక్కి తీసుకొన్న సమంత!

  • May 24, 2016 / 02:31 PM IST

“బ్రహ్మోత్సవం” సినిమా ఫ్లాపాయినందకంటే కూడా ఆ సినిమాలోని “బాలా త్రిపురమణి” పాటలో మహేష్ వేసిన స్టెప్ గురించి అందరూ నవ్వుకోవడమే మహేష్ అభిమానులకు అస్సలు మింగుడుపడడం లేదు. అయితే.. సినిమా విడుదలకు ముందు “ఆ సాంగ్ లో మహేష్ డ్యాన్స్ కేక” అంటూ సమంత ఓ ట్వీటేసింది. సదరు ట్వీట్ చూసినవాళ్ళందరూ “సాంగ్ లో ఆ రేంజ్ లో మహేష్ బాబు ఏం డ్యాన్స్ చేశాడా?” అని చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.

తీరా థియేటర్లలో మహేష్ డ్యాన్స్ చూసి హతాశులయ్యారు. దాంతో తమకు లేనిపోని ఆశలు కల్పించిన “సమంత”పై పగబట్టారు మహేష్ అభిమానులు. సదరు ట్వీట్ ను రకరకాల కామెంట్లతో రీట్వీట్లు కొడుతూ పిచ్చ తిట్లు తిట్టారు. ఎందుకొచ్చిన గొడవరా భగవంతుడా అని సమంత సదరు ట్వీట్ ను డిలీట్ చేసేసింది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus