మహేష్ బాబుతో అవకాశం రావడమే చాల్ గ్రేట్..అలాంటిది వచ్చిన అవకాశాన్ని వదిలేసిందా?? ఎవరామె..ఎంటా కధ…వివరాల్లోకి వెళితే ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా అంటేనే మిగిలిన సినిమాను అన్నీ వదిలేసి మరీ ఒప్పుకునే హీరోయిన్స్ ఉన్న ఈ రోజుల్లో మహేష్ సినిమాలు వదిలేసింది. వర్దమాన నటి ‘ప్రేమ’ . వెంకీతో ధర్మచక్రం సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ…ఆతరువాత బడా హీరోలతో మంచి సినిమాలు చేసింది. అంతేకాకుండా తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సక్సస్ ఫుల్ సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే 2009 లో చివరిసారిగా ‘శిశిర’ చిత్రంలో నటించిన ప్రేమ…ఆ తరువాత బెంగుళూరుకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకుని న్యూజిలాండ్ వెళ్ళి పోయింది.
ఇక భర్తతో విభేదాలు ఏర్పడి మళ్లీ బెంగళూరుకు తిరిగి వచ్చినే ప్రేమ సినిమాలపై కాన్సెంట్రేషన్ చేస్తున్న సంధర్భంలో ఆమెకు శ్రీమంతుడు సినిమాలో హీరో తల్లి పాత్ర వచ్చింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాత్రను చేయలేకపోయింది. ఇక ఈ మధ్య మురగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించబోతున్న భారీ చిత్రంలో మళ్ళీ ప్రేమకు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆమె డైవర్స్ వ్యవహారం బెంగుళూర్ ఫ్యామిలీ కోర్టులో పెండింగ్ లో ఉండటంతో ఆ వ్యవహారాలు పూర్తి అయ్యేవరకు తాను నటించలేనని ప్రేమ సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించిందంటా. ఏది ఏమైనా…ప్రిన్స్ తో అవకాశాన్ని వదిలేసుకుంటుంది ఈ భామ.