పాపం శ్రియ….. అలా ఇరుక్కుపోయిందట..!

  • December 11, 2019 / 06:45 PM IST

టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించేసింది శ్రియ. అయితే ఈమధ్య తెలుగు సినిమాలు ఆమె ఎక్కువగా చేయట్లేదు. ఆమె తెలుగులో ఆఖరిగా నటించిన చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. శ్రియ ఓ విదేశీ కుర్రాడిని చాలా కాలంగా ప్రేమించి పెళ్ళిచేసుకుని.. ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈమెను లండన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. పెద్ద చర్చకు దారి తీసింది. ప్రస్తుతం శ్రియ ‘సందకారి’ అనే తమిళ సినిమాలో నటిస్తుంది.

చిత్రీకరణలో భాగంగా లండన్ లో ఓ షెడ్యూల్ ను ప్లాన్ చేయడంతో టీం అంతా అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడి ఎయిర్ పోర్ట్ లోని ఓ హై సెక్యురిటీ ప్రాంతంలోకి శ్రియ అనుమతి లేకుండా వెళ్ళిందట. దీంతో పోలీసులు గన్ పాయింట్ లో ఆమెని పట్టుకున్నట్టు సమాచారం. అక్కడే షూటింగ్ జరగుతుంది కదా అని.. సరదాగా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడడానికి వెళ్ళి.. శ్రియ అలా ఇరుక్కుపోయినట్టు స్పష్టం అవుతుంది.ఇక వెంటనే విషయం తెలుసుకున్న.. చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే వెళ్ళి పోలీసులతో మాట్లాడారట. ఆ సమయంలో డాక్యుమెంట్స్ చూపిస్తేనే కానీ.. పోలీసులు శ్రీయ ను వదిలిపెట్టలేదని తెలుస్తుంది.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus