కుదురుగా ఉంటానంటే ఎక్కడ కుదురుతుంది..!

హీరోయిన్లు పద్ధతిగా ఉంటే చూడలేదండీ ఈ పాడు సమాజం. అందుకే కెరీర్ కొత్తగా ఎక్స్ పోజింగ్ కు, శృంగార సన్నివేశాలకు కాస్త దూరంగా ఉండే హీరోయిన్లు కూడా అవకాశాలు రాకపోవడం లేదా వస్తున్నవి కూడా కేవలం సెకండ్ హీరోయిన్ వి కావడంతో వేరే దారిలేక వచ్చిన రోల్స్ ఒప్పుకోలేక గ్లామర్ డోస్ పెంచుతుంటారు. ఇప్పుడు ఈ డోస్ పెంచిన జాబితాలో స్థానం సంపాదించుకొంది సురభి. తమిళ సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన సురభిని చూస్తే మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త ఎంకరేజింగ్ రోల్స్ వచ్చినప్పటికీ.. రానురాను అమ్మడిని సెకండ్ హీరోయిన్ గానే పరిగణలోకి తీసుకొంటూన్నారే తప్ప.. మెయిల్ లీడ్ గా తీసుకోవడం లేదు.

అందుకే.. అమ్మడు స్పీడ్ పెంచింది, తన అందాలను ఆరబోసేందుకు సిద్ధమంటూ ఒక హాట్ ఫోటోషూట్ చేయించుకొని వదలడంతోపాటు తన నెక్స్ట్ రిలీజ్ మూవీలో కురచ దుస్తుల్లో కనువిందు చేయనుందట. అలాగే.. హీరోలతో హాట్ హాట్ సీన్స్ అండ్ లిప్ లాక్స్ ఇవ్వడానికి కూడా తాను రెడీ అని చెప్పకనే చెబుతోంది. మరి సురభి తీసుకొన్న ఈ బోల్డ్ స్టెప్ ఆమె కెరీర్ కు ఎంతవరకూ ప్లస్ అవుతుందో తెలియదు కానీ.. ప్రేక్షకులకు మాత్రం ఈ బ్యూటీఫుల్ లేడీ అందాలు కనువిందు చేయడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus