క్లాస్ లుక్ లో అదరహో.. అనిపిస్తున్న విమలారామన్..!

2007 లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది విమలా రామన్. ఆ చిత్రం అంతంత మాత్రమే ఆడినప్పటికీ … విమలా రామన్, తన గ్లామర్ తోనూ అలాగే నటనతోనూ ఆకట్టుకుంది. దాంతో ఈమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. జగపతి బాబు ‘గాయం2’ మరియు ‘చట్టం’ అలాగే శ్రీకాంత్ తో ‘రంగ ది దొంగ’, సుమంత్ తో ‘రాజ్’, తరుణ్ తో ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’, నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది.

అయితే ఆఫర్లు వచ్చాయి కథా అని.. తన పాత్రకు ప్రాముఖ్యత ఉందో లేదో ఆలోచించకుండా ఆ సినిమాలు ఒప్పేసుకున్నట్టు ఉంది ఈ అమ్మడు. అవి ఈమెకు మంచి ఫలితాలను అందించలేదు. దాంతో కొన్నాళ్ళ పాటు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన కొత్త ఫోటోలను షేర్ చేసింది. దసరా కానుకగా ఈమె ఈ ఫోటో షూట్లలో పాల్గొంటున్నట్టు స్పష్టమవుతుంది. గతంలో తన గ్లామర్ తో ఆకట్టుకున్న విమలారామన్..

తాజా ఫొటోల్లో చాలా ట్రెడిషినల్ గా కనిపిస్తుంది. ‘క్లాస్ లుక్. ‘సూపర్ లుక్’ అంటూ నెటిజన్లు కామెంట్లు మీద కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఈ బ్యూటీ ఇంట్రెస్ట్ చూపిస్తుందట. మన తెలుగు డైరెక్టర్లు ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మాత్రం.. ఈమె కోరిక నెరవేరడం పెద్ద కష్టమేమీ కాదు. సరే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విమలా రామన్ లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus