బికినీ లో హీటేక్కిస్తున్న హార్ట్ ఎటాక్ భామ ఆదాశర్మ

  • May 1, 2018 / 08:17 AM IST

డేరింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ “హార్ట్ ఎటాక్” చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ (ADAH SHARMA) ఆదాశర్మ.. నితిన్‌కి జోడిగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా అలరించింది. అవకాశాలు తలుపుతట్టకపోయేసరికి “క్షణం” చిత్రంలో తల్లి పాత్ర పోషించింది. ఇలా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో చిన్న పాత్రలతో టచ్ లో ఉన్నప్పటికీ ఆమెకి ఇంతవరకు మంచి బ్రేక్ రాలేదు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదొక పోస్ట్ తో అభిమాలకు అందుబాటులోనే ఉంది. ఇవేమీ తనకు ఉపయోగపడేలా లేదని భావించిన బ్యూటీ బికినీతో అందాలు ఆరబోసింది. ఓ మ్యాగజైన్ కోసం టు పీస్ తో టోటల్ గా పిచ్చెక్కింది.

ఆ ఫోటోలను నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. “నా లాంటి బికినీ సోకులు మీకూ కావాలంటే ఈ టిప్స్ పాటించండి. బికినీ తీసుకోండి.. ఆ తర్వాత తొడుక్కోండి” అంటూ బికినీ ఎమోజీలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈరోజు ఆ ఫోటో షూట్ కి జరిగిన వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సముద్రం ఈ ఫోటోలకు ఫోజులిస్తూ ఆదా అందరి మతులు పోగొడుతోంది. త్వరలోనే ఈ మ్యాగజైన్ అందుబాటులోకి వస్తుందని, వాటిలో వచ్చిన ఫోజుల్లో ఏది నచ్చిందో కామెంట్ చేయమని కోరింది. ఈ దెబ్బతో సినీ అవకాశాలతో పాటు ఆదా అందానికి అభిమానులు పెరిగిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus