ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో యువ నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘నేను ఏ సినిమాను కూడా చెప్పిన డేట్‌కి రిలీజ్ అవ్వలేదు’ అని నవ్వేసి అనేశారు కానీ.. నిజానికి దీనిని ‘ప్లానింగ్ లేకపోవడం’ అంటారు. ఈ మాటను ఆయన ఒప్పుకున్నా లేకపోయినా.. ఇదే నిజమని ఆయన రిలీజ్ చేసిన సినిమాల డేట్‌లు చెబుతాయి. సినిమాల ఫలితం విషయంలో ఆయన కథల ఎంపిక బాగుంటుందని చెప్పొచ్చు. కానీ ప్లానింగ్ మాత్రం కష్టమే.
ఈ మాటను అంత కచ్చితంగా అనడానికి కారణం. ఆయన బ్యానర్ నుండి రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడుతుంది అనే వార్త బయటకు రావడమే. అక్టోబరు 2 నుండి అక్టోబర్ 9కి వాయిదా పడిన సినిమా ఇప్పుడు అక్కడి నుండి మరికొన్ని రోజులు వాయిదా పడుతుంది అని చెబుతున్నారు. ఈ విషయాన్ని త్వరలో ఆయనే ప్రకటిస్తారు అని చెబుతున్నారు. రేపో ఎల్లుండో జరిగేలా ఉందని ఫిలిం నగర్ టాక్.
సినిమా రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరసగా ఉంటాయని, వెంకటేష్ లండన్ నుంచి తిరిగి రాగానే ఈ పనులు ఉంటాయని చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాను అక్టోబర్ 30న రిలీజ్ చేస్తారని అంటున్నారు. నిజానికి దసరాకు రిలీజ్ అవ్వడానికి ‘జైలర్ 2’, ‘రణబాలి2 ఉన్న నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను తెస్తే.. వారు వాయిదా పడాలి. కానీ ఆ సినిమాలు అందుకు రెడీ లేవట.
ఇప్పుడు వాయిదాకు కారణాలేంటి అని చూస్తే.. సినిమా సన్నిహిత వర్గాల నుండి ఈ సినిమాకు సరైన హైప్ లేకపోవడమే అని కూడా అంటున్నారు. ‘బ్లాస్ట్’ సినిమాకు ఫ్రీమేక్ అనే కఠువైన కామెంట్లు వినిపిస్తున్నా.. రెండూ వేర్వేరు అంటున్నారు. ఫైనల్‌గా చూస్తే.. రెండు సినిమాలు ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండాఫ్ కోసం రీషూట్లు కొన్ని చేయాలని అనుకుంటుండటమూ వాయిదాకు కారణమని చెబుతున్నారు. చూద్దాం నాగవంశీ క్లారిటీ ఇస్తారేమో.