ఆయన సినిమాలో చీపురుకట్టలా కనిపించినా చాలు .!

  • May 16, 2018 / 06:45 AM IST

హీరో అంటే అమితమైన అభిమానంతో సినిమాలు చేసే హీరోయిన్లను చూశాం, లేదా రెమ్యూనరేషన్ కోసం కథ-కథనాలు పట్టించుకోకుండా సినిమాలు చేసిన హీరోయిన్ ను చూశాం. కానీ.. దర్శకుడి మీద విపరీతమైన గౌరవంతో తనకు వచ్చిన భారీ ఆఫర్లు సైతం వదులుకొని తనకు ఇష్టమైన దర్శకుడి చిత్రంలో నటిస్తున్న కథానాయికను ఎప్పుడైనా చూసారా..??. సమాధానం కావాలంటే అదితిరావు హైదరీని ఒకసారి చూస్తే. సరిపోతుంది. నిజానికి అమ్మడికి బాలీవుడ్ లో భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ.. వాటిని వదులుకొని మరీ మణిరత్నం “నవాబ్” చిత్రంలో నటించడానికి సమ్మతించింది.

బాలీవుడ్ లో తాను అనుకున్నదానికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చే ప్రొజెక్ట్స్ ను వదులుకొని “నవాబ్” చిత్రం కోసం అన్ లిమిటెడ్ డేట్స్ ఇవ్వడం గురించి అదితిరావును ప్రశ్నించగా.. “మణిరత్నం గారి కోసం ఏదైనా చేస్తాను నేను ఆయనంటే వెర్రి అభిమానం నాకు. ఒకవేళ ఆయన వచ్చి “అదితి ఆ కొండ మీద నుంచి దూకేయ్” అన్నారనుకోండి.. మరో ఆలోచన లేకుండా వెళ్ళి గుడ్డిగా దూకేస్తాను. అసలు ఆయన సినిమాలో ఒక మూల చీపురుకట్టలా కనిపించినా చాలు అనుకున్న నాకు “చెలియా” అనంతరం ఇమ్మీడియట్ గా ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం లభించడం అనేది ఏ జన్మలో చేసుకొన్న అదృష్టమో” అంటూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ అమ్మడు త్వరలోనే “సమ్మోహనం” అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన గొంతుతో పలకరించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus