శివాని మొదటి చిత్రం ఆగిపోవడానికి అసలు కారణం అదేనంట?

Advertisement

అడివి శేష్ హీరోగా.. జీవిత రాజశేఖర్ ల పెద్ద కుమార్తె శివాని హీరోయిన్ గా ‘2 స్టేట్స్’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చేతన్ భగత్ రచించిన ‘బెస్ట్ సెల్లర్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎం.ఎల్.వి. సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తయ్యిందట. అయితే ఈ చిత్రం రష్ చూసిన తర్వాత అవుట్ ఫుట్ పై హీరో అడివి శేష్ అసంతృప్తిగా ఉన్నాడట. దీంతో మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పాడట.

అయితే దీనికి దర్శకనిర్మాతలు నో చెప్పడంతో అడివి శేష్ నిరాశకు గురయ్యాడట. దీంతో ఈ చిత్రాన్ని శేష్ వదిలేసాడని తెలుస్తుంది. అయితే దర్శక నిర్మాతలు కూడా శేష్ ను పాటించుకోవట్లేదని … దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో హీరోయిన్ శివాని చాలా అప్సెట్ అయ్యిందట. తన మొదటి చిత్రానికి.. అందులోనూ షూటింగ్ పూర్తయిపోయిన చిత్రానికి ఇలాంటి అడ్డంకులు రావడం పట్ల ఆమె చాలా నిరాశకు గురయ్యిందట. అయితే జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక మొదటి చిత్రం దొరసాని కి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ ను పూర్తి చేస్తుంది. విజయ్ దేవరకొండ తమ్మడు ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus