‘ఆర్.ఆర్.ఆర్’ టీంకు మరో షాక్.. !

  • April 24, 2019 / 01:22 PM IST

అసలే రాంచరణ్ కు గాయమవ్వడంతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ 3 వారాల పాటూ నిలిచిపోయింది. చరణ్ కోలుకోవడంతో.. ప్రస్తుతం హైదరాబాద్ లో తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి కూడా గాయమయ్యింది. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన కొందరు ఎన్టీఆర్ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు మరోసారి షూటింగ్ ఆగిపోతుందేమో అని వారు కంగారు పడుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదట. ఎన్టీఆర్ షూటింగ్లో యదావిధిగా పాల్గొంటాడని తెలుస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఫోటోలలో ఎన్టీఆర్ కుడి చేతికి కట్టు కట్టుకుని ఉన్నాడు. అయితే కంగారు పడాల్సింది ఏమీ లేదని… అది చిన్న గాయమేనని… ఎన్టీఆర్ యధావిధిగా ‘ఆర్.ఆర్.ఆర్’ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటాడని… సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక రాజమౌళి ఎన్టీఆర్ కు హీరోయిన్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండవ షెడ్యూల్ లో హీరోయిన్లతో చిత్రీకరించాల్సిన సీన్లు చాలా పెండింగ్ లో ఉన్నాయట. హీరోయిన్ సెట్ అయితేనే కానీ ఆ సీన్లు కంప్లీట్ అవ్వవని వారు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus