సుజిత్ తర్వాత ఆ డైరక్టర్ కే ఛాన్స్..!!

  • August 2, 2016 / 10:26 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కంక్లూజన్ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపించాయి. ఇందుకోసం సుజిత్ మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాడు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణకు తాజాగా ప్రభాస్ డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. యుద్ధ సన్నివేశాలతో విసిగి పోయిన ప్రభాస్ పూర్తి రొమాంటిక్ పాత్ర చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రాధాకృష్ణ చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో ఆయనకే ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ టాక్.

ఇందులో ప్రభాస్ చేతిని చూసి జాతకాలు చెప్పే పాత్రలో కనిపిస్తాడని, షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరగనున్నట్లు సమాచారం. జనవరి నుంచి షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం కోసం నూతన నటిని ఎంపిక చేసే పనిలో రాధా కృష్ణ బిజీగా ఉన్నారు. ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుజిత్ టీమ్ సభ్యులు ఆలోచనలో పడ్డారు. చివరి క్షణంలో ప్రభాస్ ఇలా ఎందుకు చేసాడు అని బాధపడుతున్నారు. ప్రభాస్ మాట తప్పడని, కచ్చితంగా తమకు కూడా డేట్స్ కేటాయిస్తారని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను మిర్చి చిత్రాన్ని తీసిన యువీ క్రియేషన్స్ వాళ్లే నిర్మించనున్నారు. అయితే ఏ డైరక్టర్ సినిమా మొదట మొదలు కానుంది అనేది కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus