సినిమా బాగుందంటూ టాక్ తోపాటు రివ్యూస్ కూడా వచ్చినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. అందుకు ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్సే నిదర్శనం. వారం మొత్తం కలిపి 20 కోట్లు కూడా వసూలు చేయలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడిందీ చిత్రం. ఈ సినిమాకి కలెక్షన్స్ రాకపోవడానికి చాలా కారణాలున్నాయని చెబుతున్నప్పటికీ.. ముఖ్యకారణంగా మాత్రం నాగబాబు మరియు నాదెండ్ల భాస్కర్ రావుల పేర్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ కలెక్షన్స్ తగ్గడానికి.. నాగబాబు-నాదెండ్లకు సంబంధం ఏమిటా అనుకుంటున్నారా.
ఇక్కడ విషయం ఏంటంటే.. సరిగ్గా ఎన్టీఆర్ బయోపిక్ విడుదలయ్యే టైమ్ లో నాగబాబు యూట్యూబ్ ద్వారా బాలయ్య చేసిన కొన్ని స్టేట్ మెంట్స్ ను కడిగిపారేశాడు. ఇక సినిమా విడుదలైన మొదటి రోజే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల చీకటి కోణాలను మీడియా ద్వారా వెల్లడించాడు నాదెండ్ల. దాంతో జనాలకు ఎన్టీఆర్ బయోపిక్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది. ఆ కారణంగానే సినిమాకు కలెక్షన్స్ లేవని విశ్లేషణలు వెల్లడవుతున్నాయి.