టాప్ హీరోయిన్స్ నుంచి అప్ కమింగ్ వరకూ అందరూ బానిసలే

  • March 6, 2019 / 05:52 PM IST

సరిగ్గా ఏడాదిన్నర క్రితం డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ ను కుదేలు చేసింది. పూరీ జగన్నాధ్, ఛార్మీ, సుబ్బరాజు లాంటి వాళ్ళను సిట్ వారు గంటల తరబడి ఇంటరాగేషన్ చేయడం, వీళ్ళకి డ్రగ్స్ మాఫియాతో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయని గుసగుసలు వినిపించడంతో పెద్ద రచ్చ జరిగింది. షరా మామూలే అన్నట్లుగా ఆ ఇష్యూ తర్వాత సైలెంట్ అయిపోయిందనుకోండి. మళ్ళీ ఇప్పుడు ఆ డ్రగ్స్ రచ్చ పెరుగుతోంది.

అప్పట్లో పోలీసులు కాస్త స్ట్రిక్ట్ గా ఉండడం వలన హీరోహీరోయిన్లు ఈ డ్రగ్స్ కి కాస్త దూరంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మళ్ళీ ఆ డ్రగ్స్ మహమ్మారి కాస్త గట్టిగా వ్యాపిస్తోందని టాక్. మన టాప్ హీరోయిన్స్ మాత్రమే కాక అప్ కమింగ్ హీరోయిన్స్ కూడా ఈ డ్రగ్స్ మత్తులో పడి చేయకూడని పనులు చేస్తున్నారని, దీనికి రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా ఉందని సమాచారం. దాదాపుగా అందరూ పెద్ద తలకాయలే ఇందులో ఉండడంతో ఈ విషయాన్ని వార్తల్లో వ్రాయడానికి పెద్ద న్యూస్ పేపర్లు కూడా జంకుతున్నాయి. మరి ఈ విషయం ఇలాగే సైలెంట్ గా ఉంటుందా లేక ఎప్పుడో ఒకప్పుడు వైరల్ అవుతుందా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus