విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు VD 12 (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. జెర్సీ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా బజ్ క్రియేట్ చేసింది. విజయ్ ని సందీప్ రెడ్డి వంగాతో సహా మిగతా దర్శకులు అగ్రెసివ్ లేదా రొమాంటిక్గా చూపించారు. కానీ ఇప్పుడు గౌతమ్ విజయ్ను చాలా విభిన్నమైన అవతారంలో చూపిస్తున్నాడు అని ఆ పోస్టర్ తో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సైతం ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉందని రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఒక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా , ఇంకో పాత్రలో ఖైదీగా అలరించనున్నాడు.. అని తెలుస్తుంది. ఫస్ట్ పోస్టర్లో ఖైదీ అవతారంలో విజయ్ దర్శనమిచ్చాడు. ఇక ఈ సినిమాను అనౌన్స్ సందర్భంగా పోలీస్ గెటప్ లో విజయ్ పోస్టర్ రిలీజ్ చేశారు.
పూర్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో నటించడం విజయ్ కి చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. దర్శకుడికి కూడా ఇది ఒక ఛాలెంజ్ అని అనుకోవచ్చు. హీరో పాత్రలు చూస్తుంటే ఈ మూవీ కొత్త కథతో రాబోతున్నట్లు స్పష్టమవుతుంది. విజయ్ లైగర్ (Liger) సినిమా డిజాస్టర్ కాగా ఖుషి (Kushi) పర్వాలేదు అనిపించింది,ఇక ఫ్యామిలీ స్టార్ ఆడలేదు. విజయ్ మంచి హిట్ అందుకుని చాలా రోజులు అవుతుంది. విజయ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా పడుతున్నాడు. యంగ్ డైరెక్టర్స్ తోనే కంటెంట్ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. వాటిపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక VD12 షూటింగ్ చివరికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh Ravichander) ఇంకా పని మొదలుపెట్టలేదు అని తెలుస్తుంది. అనిరుధ్ పనిచేసే ప్రతి సినిమాకి ఇదే సమస్య. అతను అందుబాటులో ఉండడు. ఫోన్లు ఎత్తడు అనే కంప్లైంట్ ఎప్పుడూ ఉంటుంది. ‘దేవర’ (Devara) విషయంలో దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నాడు. గతంలో ‘జెర్సీ’ టైంలో కూడా గౌతమ్ ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ‘VD 12’ తో మరోసారి అతనికి ఇలాంటి సమస్య వచ్చి పడింది. టైం సినిమాని రిలీజ్ చేయాలంటే అనిరుధ్ సహకారం కావాలి. లేదు అంటే రిలీజ్ డిలే అయ్యే సమస్య ఉంది.