తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి ఫస్ట్ డే కలక్షన్స్

  • January 11, 2018 / 09:26 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం అజ్ఞాతవాసి నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2700 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకుంది. అయినా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 26.93 కోట్ల షేర్ అందుకొని పవన్ క్రేజ్ ని చాటింది. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సాధించిన రికార్డ్ ని బీట్ చేసింది. చిరు రీ ఎంట్రీ మూవీ తొలి రోజు 23.30 కోట్లు రాబట్టింది. ఫస్ట్ డే రికార్డ్స్ లో అన్నను తమ్ముడు మించాడు. దీంతో బాహుబలి కంక్లూజన్ తర్వాతి స్థానంలో పవన్ నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తోలు రోజు అజ్ఞాతవాసి సాధించిన కలక్షన్స్ (షేర్ ).. కోట్లలో..

నైజాం : 5.45
సీడెడ్ : 3.38
ఉత్తరాంధ్ర : 4.30

తూర్పు గోదావరి : 2.85
పశ్చిమ గోదావరి : 3.70
కృష్ణ : 1.83
గుంటూరు : 3.78
నెల్లూరు : 1.64
రెండు రాష్ట్రాల్లో మొత్తం : 26.93

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus