తెలుగులో నంబర్ వన్.. సౌత్ లో నెంబర్ 2

  • December 20, 2017 / 05:52 AM IST

పవన్ కళ్యాణ్ కి రికార్డ్స్ కొత్తకాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతను చేసిన అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అయినా తర్వాత అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఆ డైరక్టర్ తో కలిసి పవన్ చేసిన తాజా చిత్రం అజ్ఞాతవాసి విడుదలకి ముందే రికార్డ్స్ వేట మొదలు పెట్టింది. ఈ మూవీ టీజర్ శనివారం సాయంత్రం రిలీజ్ అయి  యూట్యూబ్ రికార్డ్స్ ను తిరగరాస్తోంది. ఇప్పటికే తెలుగుతో అతి తక్కువ సమయంలో అత్యధిక మంది వీక్షించిన టీజర్ గా, అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా అజ్ఞాతవాసి రికార్డ్ సృష్టించింది. తాజాగా దక్షిణాదిలోనూ పవన్ సినిమా టీజర్ జోరు కనిపిస్తోంది. ఈ టీజర్ సౌత్ ఇండియాలో 24 గంటల్లో అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.

విజయ్ హీరోగా నటించిన మెర్సల్ టీజర్ కు అత్యధికంగా ఏడు లక్షల నలబై వేలకు పైగా లైక్ లు రాగా అజ్ఞాతవాసి టీజర్ నాలుగు లక్షలకుపైగా లైకుల వచ్చాయి. తెలుగు సినిమా రికార్డ్స్ లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమా ‘జై లవకుశ’ టీజర్ 24 గంటల్లో 1.92 లైక్స్ తెచ్చుచుకుని మొదటి స్థానంలో నిలిచింది.  1.9 లక్షల లైక్స్‌తో రెండో స్థానంలో  మహేష్ బాబు ఉన్నారు. వీరిద్దరి రికార్డ్స్ ని అజ్ఞాతవాసి బీట్ చేసాడు. దక్షిణాదిలో అజ‍్ఞాతవాసి తరువాతి స్థానాల్లో సూర్య  తాన‌ సేరంద కూటం, అజిత్ వివేగం, రజనీ కబాలి టీజర్లు ఉన్నాయి. హారిక అండ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాతవాసి జనవరి 10 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus