నాగ్ పుట్టిన రోజున అఖిల్ రెండో సినిమా షురూ..!!

  • July 30, 2016 / 01:26 PM IST

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ రెండో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అందాల రాక్షసి,  “కృష్ణ గాడి వీర ప్రేమ గాధ” చిత్రాలతో డిఫరెంట్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో అఖిల్ నటించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి వెల్లడించేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఆగస్టు 29. ఆ రోజున సినిమా ప్రారంభించాలని అఖిల్ భావిస్తున్నారు.

అదే రోజు సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటులతో పాటు టెక్నీకల్ సిబ్బంది వివరాలను మీడియాకు అందివ్వనున్నారు. ఇందుకు నాగార్జున కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. కొడుకు తొలి సినిమా ఫెయిల్ కావడంతో రెండో సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని నాగ్ శ్రమించారు. తన ప్రాజెక్ట్ లన్నీ పక్కన పెట్టి కథలను విన్నారు. చివరకు హను చెప్పిన కథ నచ్చడంతో తాను “ఓం నమో వెంకటేశాయ” షూటింగ్ లో బిజీ అయ్యారు. ఆయన చేతుల మీదుగా చిత్రాన్ని ప్రారంభించాలని దర్శకుడు హను కూడా ఆసక్తి గా ఉన్నారు. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ఉంటుందని చిత్ర బృంద సభ్యులు తెలిపారు. యాక్షన్, లవ్ ఎంటర్ టైన్ జాన్రాలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కిలారు వెంకట రత్నం నిర్మించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus