అఖిల్ పెళ్లి ఫిక్సయింది!

  • September 9, 2016 / 12:41 PM IST

అక్కినేని ప్రిన్స్ అఖిల్ త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడు. అతను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. తాను నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రేయ భూపాల్ ని ప్రేమిస్తున్నట్లు తండ్రి అక్కినేని నాగార్జునకు అఖిల్ కొన్ని రోజుల క్రితం చెప్పాడు. కొడుకు ప్రేమ సంగతి తెలిసిన నాగ్ సంతోషంగా అంగీకరించాడు. దీంతో పెళ్లి ఎప్పుడు ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అమల, నాగార్జునలు కొడుకుకి మంచి ముహూర్తం ఫిక్స్ చేశారు.

అఖిల్ కోరిక ప్రకారమే డిసెంబరు 9న అఖిల్ నిశ్చితార్థం జరుగుతుందని నాగ్ గురువారం మీడియాకు వెల్లడించారు. పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తెర పడింది. వైభవవంగా జరగనున్న నిశ్చితార్థం  వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus