అఖిల్ కోసం ప్రేమ కథ రాసిన వెంకీ అట్లూరి!

  • March 9, 2018 / 05:02 PM IST

కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి టైటిల్ పాతది తీసుకున్నా..  ప్రేమ కథను కొత్తగా ఆవిష్కరించి హిట్ కొట్టారు.  వరుణ్ తేజ్, రాశీ ఖన్నాలతో అతను తెరకెక్కించిన “తొలి ప్రేమ” భారీ కలక్షన్స్ రాబట్టాయి. దీంతో పరిశ్రమ పెద్దల దృష్టిలో పడ్డారు. అక్కినేని కుటుంబం నుంచి కూడా కాల్ అందుకున్నట్లు తెలిసింది. అఖిల్ కి మంచి లవ్ స్టోరీ సిద్ధం చేయమని చెప్పడంతో కొంతకాలంగా డైరక్టర్ అదే పనిలో ఉన్నారు. రీసెంట్ గా అఖిల్ కి ఓ లైన్ వినిపించారని, అది నచ్చడంతో స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు వెల్లడించారు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో  చేసిన “హలో” మూవీ విజయం సాధించడంతో అఖిల్ మంచి ఉత్సాహంతో ఉన్నారు.  మూడో సినిమాకు సిద్ధమవుతున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వేగంగా సాగుతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్న ఈ మూవీ తెలుగు సంవత్సరాది ఉగాది రోజు పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ చిత్రం తర్వాత వెంకీ అట్లూరి మూవీ పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus