నాగ చైతన్యను క్రాస్ చేసిన అఖిల్

  • December 30, 2017 / 06:35 AM IST

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేసిన హలో మూవీ సూపర్ హిట్ దిశగా దూసుకు పోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ ఈనెల 22 న రిలీజ్ అయి అన్ని ఏరియాల్లో మంచి కలక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హలో మూవీకి ఆదరణ ఎక్కువగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులకు ఈ మూవీ 12 కోట్ల పైనే షేర్ వసూలు చేసి అఖిల్ కి మంచి విజయాన్ని అందించింది. మనదేశంలోనే కాకుండా అక్కినేని ప్రిన్స్ చిత్రానికి ఓవర్సీస్ లోను మంచి స్పందన వస్తోంది.

ఇప్పటి వరకు హలో 8.33 లక్షల డాలర్లను వసూలు చేసి మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది. రెండో చిత్రంతోనే అన్నను క్రాస్ చేసి ఔరా అనిపించాడు. యూఎస్ లో నాగ్ చైతన్య హిట్ సినిమా ‘ప్రేమమ్’ ఫుల్ రన్ కలెక్షన్స్ 8.29 లక్షల డాలర్లు. ఇదే చైతూ కెరీర్లో ఓవర్సీస్ బెస్ట్ కలక్షన్స్. దీన్ని అఖిల్ ‘హలో’ తో మొదటి వారంలోనే అధిగమించడం విశేషం. ఇక పండుగ సీజన్ వరకు పోటీకి వచ్చే సినిమాలు లేవు కాబట్టి లాంగ్ రన్ లో మంచి నంబర్ కి చేరుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు చెప్పారు. అఖిల్ హలో మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. నెక్స్ట్ సినిమా కోసం కథలు వింటున్నారు. జనవరి పదో తేదీన తన నెక్స్ట్ మూవీ ప్రకటన చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus