తొలి చిత్రంతో హిట్ అందుకున్న అఖిల్

  • September 14, 2016 / 10:17 AM IST

దాదా సాహెబ్ అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు మనవుడు అక్కినేని అఖిల్ నటించిన తొలి చిత్రం సిసింద్రీ విడుదలై నేటికీ 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1995 సెప్టెంబర్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శివ నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 34 సెంటర్స్ లో 50 రోజులు, 2 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. సిసింద్రీ తీసేటప్పుడు అఖిల్ వయసు ఎనిమిది నెలలు మాత్రమే.

ఆ వయసులో చిన్నితండ్రి చేసిన సందడి తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చింది. ఇందులో ఆమని, శరత్ బాబులు అఖిల్ కి తల్లి దండ్రులుగా నటించగా, సుధాకర్, గిరిబాబు, తనికెళ్ల భరణి నెగటివ్ పాత్రలో మెప్పించారు. కింగ్ నాగార్జున, టబు లు గెస్ట్ అప్పీరియన్స్ తో అదరగొట్టారు. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ్  సొంతంగా నిర్మించిన ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలను అయన బ్లూ క్రాస్ సొసైటీ బిల్డింగ్ కోసం అందించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus