ఆ ప్రపోజల్ కి షాక్ అయిన అక్కినేని అఖిల్ !

  • July 19, 2017 / 06:46 AM IST

టాలీవుడ్ లో అక్కినేని వారసులుగా చాలామణీ అవుతున్న వారిలో నేటి తరం హీరో అఖిల్ ఒకరు…తొలి సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా డమాల్ మనడంతో తన రెండో సినిమా పై పూర్తి ఫోకస్ పెట్టాడు మన యువ హీరో…తండ్రి నవమన్మధుడు నాగ్ ప్రేరణతో లవర్ బోయ్ ఇమేజ్ తో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తూ తన రెండో సినిమాని మనం దర్శకుడు విక్రమ్ తో చేస్తున్నాడు అఖిల్. ఇదిలా ఉంటే ప్రొఫెషనల్ గా కాస్త పక్కన పెడితే…పర్సనల్ గా అఖిల్ కు వచ్చిన ఒక ప్రపోజల్ చూసి అఖిల్ షాక్ అయ్యాడట, ఇంతకీ ఏంటి ఆ ప్రపోజల్? ఏమా కధ అంటే…ఒకసారి ఈ మ్యాటర్ చదవండి…మ్యాటర్ లోకి వెళితే….అఖిల్ కు ఈమధ్య ఫ్లైట్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందట. ఏంటి ఆ ఇన్సిడెంట్? అంతగా ఏం జరిగింది అంటే… ఫ్లైట్ లో తాను సేదతీరుతున్న సమయంలో ఎవరో వచ్చి తను సీట్ ముందు లెటర్ పెట్టి వెళ్లారని తీరా చూస్తే నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్.. నువ్వు ఓకే అంటే నేను రెడీ అని రాసుందని చెప్పాడు.

పక్కన వాళ్లని అడిగితే అది ఒక అబ్బాయి రాశాడని అన్నారట. విషయం తెలుసుకున్న అఖిల్ దిమ్మతిరిగిందట. వెంటనే ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే చాటు చాటుగా గమ్యాన్ని చేరుకున్నాడట. అఖిల్ అంతగా ఖంగు తిన్నది ఎందుకంటే ఆ ప్రపోజల్ అమ్మాయి చేసినా సరే సరదాగా తీసుకునే వాడు కాని ఓ అబ్బాయి చేయడం వల్లే అంత హంగామా చేశాడు. ఈ విషయాలు అన్నీ ఎలా బయటకు వచ్చాయి అంటే…మన యువ హీరో రానా హోస్ట్ గా చేస్తున్న నెంబర్ 1 యారి షోకి గెస్ట్ గా వచ్చిన అఖిల్ తన లైఫ్ లో జరిగిన ఈ ఫన్నీ సన్నివేశాన్ని బయట పెట్టాడు… ఇక ఈ మ్యాటర్ తెలియగానే రాణా ఓ రేంజ్ లో ఆడుకున్నాడు అఖిల్ ని…మొత్తంగా అఖిల్ క్రేజ్ అలా ఉంది మరి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus