కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్

  • February 20, 2018 / 06:21 AM IST

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని ప్రిన్స్ అఖిల్ చేసిన ‘హలో’ మూవీ విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ మంచి కలక్షన్స్ రాబట్టింది. ఈ ఉత్సాహంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమాని వెంటనే ప్రారంభిస్తానని చెప్పారు. తన నెక్స్ట్ సినిమా వివరాలను జనవరి 10 న వెల్లడిస్తానని అన్నారు. నెల రోజులైనా సినిమా వివరాలు ప్రకటించకపోవడంతో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. రామ్ గోపాల వర్మ అసిస్టెంట్ దర్శకత్వంలో నటించడానికి అఖిల్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఆ రూమర్లకు నేటితో ఎండ్ పడింది. అఖిల్ మూడో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమాలు తీసే కొరటాల శివ దర్శకత్వంలో అఖిల్ సినిమా చేయనున్నట్లు తెలిసింది.

దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ కెమెరామెన్ గా ఖరారు అయ్యారు. ఇక మొదట నుంచి తన టీమ్ లో ఉన్న రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ని మార్చలేదు. ఈ సినిమాకి కూడా తననే మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలు, వాణిజ్య ప్రకటనలకు ఆర్ట్ డైరక్టర్ గా వ్యవహరించిన సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రం కోసం అద్భుత సెట్స్ డిజైన్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి తెలుగు సంవత్సరాది ఉగాది రోజు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus