సమంతకు రక్షణగా నిలిచినా అఖిల్

  • July 6, 2017 / 07:21 AM IST

కరీంనగర్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ని నిన్న(బుధవారం) అక్కినేని అఖిల్, సమంతలు కలిసి ప్రారంభించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో కరీనగర్ కు వెళ్లిన వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అఖిల్, సమంతలు చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపించారు. షాపింగ్ మాల్ బయట మాత్రమే కాకుండా, మాల్ ల్లో కూడా సమంతతో కలిసి ఫోటోలు దిగేందుకు చాలా మంది పోటీ పడ్డారు. దీంతో సమంత ఇబ్బంది పడింది. ఈ విషయాన్నీ గమనించిన అఖిల్ వదినకు బడీ గార్డ్ గా మారారు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చెయ్యి పట్టి నడిపించారు.

రక్షణగా నిలిచారు. వదినను అమ్మగా గౌరవించే సంప్రదాయం మనది.. అలాగే తన వదిన పట్ల అఖిల్ ప్రవర్తించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. అఖిల్ అన్నయ్య నాగచైతన్య, సమంతలకు జనవరిలో నిశ్చితార్ధం జరిగింది. అక్టోబర్ ఆరవ తేదీన పెళ్లి చేసుకోనున్నారు. అంతకంటే ముందే సమంత అక్కినేని ఇంట అందరితో బాగా కలిసిపోయింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus