టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున రెండోవ కుమారుడు అక్కినేని అఖిల్ తన సినిమా ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఎంత గ్రాండ్ గా అయితే సినిమా ప్లాన్ చేసుకున్నాడో, సినిమా అంటే డిజాస్టర్ అయిపోయింది. ఇక తన తరువాత సినిమా ఇంకా మొదలైతే కాలేదు కానీ, త్వరలోనే ఈ సినిమా విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బుల్లి తెరలో “డేట్ విత్ అనసూయ” అనే ప్రోగ్రామ్ మొదలయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు అక్కినేని అఖిల్. ఇక ఆ ప్రోగ్రామ్ లో మనసు విప్పి మాట్లాడేసి, దాదాపుగా తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేసినంత పని చేశాడు మనవాడు. ఇంతకీ మనవాడు యాంకర్ ఏమని అడిగింది మన వాడు ఏం చెప్పాడు అంటే…మీరు లవ్ లో ఉన్నారు అంట కదా, మీ పెళ్లి ఎప్పుడు అని యాంకర్ అనసూయ అడగగానే….మనవాడు చాలా తెలివిగా…”అవును. నేను చెప్పాల్సినంత అవసరం లేదు. దాని గురించి ఎక్కువ మాట్లాడను కాని..
నేను ప్రస్తుతం చాలా హ్యాపీ స్పేస్ లో ఉన్నానని చెప్పగలను. ఇప్పుడే మేం తొందరపడట్లేదు. ముందు నా రెండో సినిమాపై ఫోకస్ పెడుతున్నా. ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ నాకు. అందుకే ప్రస్తుతానికి దీనిమీదనే నా ధ్యాసంతా” అంటూ చెప్పుకొచ్చాడు అఖిల్. అమ్మాయి పేరు చెప్పకుండా.. తాను ప్రేమలోనే ఉన్నానంటూ ఒప్పుకుని.. కాకపోతే కెరియర్ మీదనే ఫోకస్ పెడతా అన్నాడు. అయితే అఖిల్ శ్రీయ భూపాల్ అనే ఓ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నాడని.. మనోడు త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని అనేక రూమర్లు వచ్చిన తరుణంలో మన హీరో చేసిన కామెంట్స్ కు కాస్త బేస్ దొరికింది. ఇక త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుంది.