అల్లుఅర్జున్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న అక్కినేని హీరో..?

  • April 13, 2019 / 05:57 PM IST

టాలీవుడ్లో ప్రస్తుతం చాలా మంది కుర్ర హీరోలు, ఫేడౌట్ అయిపోయిన హీరోలు… క్రేజ్ ఉన్న హీరోల సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని సరికొత్త ఇమేజ్ ను సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ఇలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ… నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరో సుశాంత్ కూడా తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్నాడట. చాలా కాలంగా హిట్స్ లేక బాధపడుతున్న సుశాంత్ కి ‘చిలసౌ’ లాంటి డీసెంట్ హిట్టందుకుని ఓ వెలుగు వెలిగాడు. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ ను మరింత పెంచుకోవాలాని చూస్తున్నాడట.

ఇందులో భాగంగా త్రివిక్రమ్-అల్లు ఆర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనటించడానికి సుశాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా.. ఆకట్టుకునే విధంగా ఉంటుందట. అమాయకపు అబ్బాయి పాత్రలో సుశాంత్ ఈ చిత్రంలో కనిపిస్తాడని సమాచారం. సుశాంత్ పాటూ నవదీప్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తాడట. ‘హారికా హాసిని క్రియేషన్స్’ ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus