ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ కొట్టేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!

  • July 12, 2019 / 02:56 PM IST

తాజాగా ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల లిస్ట్ ను విడుదల చేసింది. గతేడాది ఇండియా నుండీ చాలా మంది సెలెబ్రిటీలు ఈ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్నారు. కానీ ఈసారి మాత్రం కేవలం అక్షయ్ కుమార్ ఒక్కడే ఆ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకున్నాడు. ఈ లిస్ట్ లో టేలర్ స్విఫ్ట్ నెంబర్ వన్ గా నిలవగా హీరో అక్షయ్ కుమార్ కు 35వ స్థానం దక్కింది. అక్షయ్ తాను నటించే ప్రతీ సినిమాకి 35 నుండీ 70 కోట్ల వరకూ తీసుకుంటుంటాడు. మంచి సబ్జెక్టులు ఎంచుకుని వరుసగా ఏడాదికి మూడు నుండీ నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు. పైగా అన్నీ మినిమం గ్యారంటీ సినిమాలే.

బాలీవుడ్ లోనే టాప్ ఎర్నింగ్ స్టార్ గా అక్షయ్ కుమార్ పేరుని ఈ మ్యాగజైన్ రాసుకొచ్చింది. జూన్ 2018 నుండీ ఈ ఏడాది జూన్ వరకూ మొత్తం రూ.444 కోట్ల సంపాదనతో అక్షయ్… ఇంటర్నేషనల్ స్టార్లు అయిన రిహానా, జాకీచాన్, బ్రాడ్లీ కూపర్, స్కార్లెట్ జాన్సన్ వంటి వారిని అధిగమించడం విశేషం. కేవలం సినిమాలతోనే కాదు యాడ్స్ నుండీ కూడా భారీ మొత్తం అందుకుంటున్నాడు ఈ స్టార్ హీరో. దాదాపు ఇరవై బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు అక్షయ్. నిర్మాతలకి కూడా అక్షయ్ కుమార్ మీద ఎంతో నమ్మకం. వారు పెట్టిన అడ్వాన్స్ లకి కూడా 100 కి 100 శాతం న్యాయం జరుగుతుందని అక్షయ్ పై గట్టి నమ్మకంతో ఉంటారు కూడా..! ఏమైనా అక్షయ్ సినిమాలతో మాత్రమే కాకుండా ఇలా ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించి అందరినీ అధిగమించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus