షూటింగ్ కు రెడీ అవుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోయిన్లు..!

  • March 28, 2019 / 05:15 PM IST

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం ఇప్పటి నుండే ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నార్త్ లో జరిగే షెడ్యూల్స్ కు రెడీ అవుతుంది. కోల్ కతా,అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరుగబోతుందని తాజా సమాచారం. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, చరణ్ తో పాటూ హీరోయిన్లు అలియా భట్ , డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కాబోతున్నారట.

స్వాతంత్య్ర సమర యోధులయిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా స్టార్ద దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే వారి యుక్త వయసులో జరిగిన కొన్ని సంఘటనలను మాత్రమే ఈ చిత్రంలో తీసుకోబోతున్నాడట మన జక్కన్న. తరువాత వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు అనే ఫిక్షన్లెస్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు మన జక్కన్న. ఇక చరణ్ కు జోడిగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా డైసీ నటిస్తున్నారు. ఇక కొన్ని ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, కోలీవుడ్ డైరెక్టర్ సముద్రఖని నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus