కాస్త ఎంకరేజ్ చేయండమ్మా!!!

మహేష్ భట్ చరిష్మా తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆయన కూతురు అలియ భట్. అయితే రావడం రావడంతోనే తొలి సినిమాలో బికినీతో ఎంట్రీ ఇచ్చి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరచింది. సహజంగా వారసత్వం పుణికిపుచ్చుకున్న వారిపై అనేక అంచనాలు ఉంటాయి. అదే క్రమంలో అలియ భట్ పై కూడా అనేక అంచనాలు ఉండడంతో ఈ భామ నటన పరంగా అనేక విమర్శలు ఎదుర్కుంటూ, కేవలం గ్లామర్ తోనే నెట్టుకుని ముందుకు సాగుతుంది అన్న రూమర్స్ ఉన్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఒక వేడుకలో ఈ భామ మాట్లాడుతూ అనేక విషయాలు బయటపెట్టింది. గ్లామర్ తప్ప యాక్టింగ్ లో పసలేదు అని విమర్శలు వస్తున్న తరుణంలో హైవే, ఉడ్తా పంజాబ్ సినిమాలతో ఆ విమర్శలకు చెక్ పెట్టింది ఈ సెక్సీ బ్యూటీ. అదే క్రమంలో ఇలాంటి అలాంటి రియలిస్టిక్ సినిమాలే కాదు, మసాలా ఉన్న సినిమాలు కూడా తనకు చాలా ఇష్టమని, కేవలం ఆర్ట్ సినిమాలు, హీరోయిన్ ప్రాధాన్యమున్న సినిమాల్లో మాత్రమే నటిస్తానని అనుకోవద్దని మాంచి మాస్ మసాలా సినిమాలో నటించాలని ఉందని అలియా తన మనసులోని మాటను బయట పెట్టింది. అంటే తనకు కూడా మసాలా సినిమాలు చెయ్యాలనే ఆలోచన ఉంది అన్న మాట….ఒక కత్రీనా లాగా ‘షీలా కీ జవానీ’, ‘చిక్ నీ చమేలీ’ అని చెయ్యాలన్న ఆశ ఉందన్న మాట. ప్రస్తుతం డియర్ జిందగీలో నటిస్తుండగా,త్వరలోనే మన బాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తే మసాలా సినిమాతో దూసుకుపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూడాలి మరి మన వాళ్ళు ఈ భామకు ఎలాంటి అవకాశాలు ఇస్తారో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus