తారక్…టైగర్ ఆఫ్ టాలీవుడ్!!!

అవును ఎన్నో ఇబ్బందులు, వరుస పరాజయాలతో ఇక్కట్లు పడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవర్ని అడిగిన ఎన్టీఆర్ అన్న పదమే వినిపిస్తుంది. అదే క్రమంలో పరాజయాలను దాటుకుంటూ మళ్ళీ టాప్ పొసిషన్ లోకి వచ్చేశాడు తారక్. ఇప్పుడు తారక్ మానియా ఎంతలా ఉంది అంటే…నా మాటల్లో కాదు….మన టాలీవుడ్ సెలెబ్రెటీస్ మాటల్లోనే చూద్దాం….ముందుగా మన మెగా ఫ్యామిలీ సంగతే తీసుకుంటే….యువ హీరోలు సాయి ధర్మ తేజ అయితే ఇప్పుడున్న హీరోలకి తారక్ అన్న ఆదర్శం అనేసాడు.

వరుణ్ తేజ అయితే జనతా గ్యారేజ్ ట్రైలర్ చూసి టైగర్ కుమ్మేసింది అని ట్వీట్ చేశాడు. ఇక పవన్ కల్యాణ్, మహేష్ బాబులు ఇప్పటికే తారక్ లాగా డ్యాన్స్ చెయ్యడం, మయ వల్ల కాదు అని తేల్చి చెప్పేశారు. అదే క్రమంలో కొణిదెల వంశం నుంచి వచ్చిన వారసురాలు నిహారిక సైతం తారక్ తో ఒక్క చాన్స్ వస్తే చాలు అంటూ ఎదురు చూస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్నా హిరోహిన్లు అయితే తారక్ సినిమా లో చాన్స్ కోసం కళ్ళు కాయలు కాసేదాక ఎదురుచూస్తున్నారు. అలాగే ఆ తరం నాయికలు ఎన్టీఆర్ సినిమా లో ఎదో ఒక చాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

అంతటితో అయిపోయిందా..మన టాలీవుడ్ బడా హీరోలు….నాగార్జున్ ఇప్పటికి ఎప్పటికి యంగ్ హిరో లలో నాకు తారక్ అంటేనే ఇష్టం అతని డాన్స్ అలాగే డైలాగ్ డెలివరీ ఎవ్వరి కి సాధ్యం కాదు అని సింహద్రి టైం నంచి మెన్న నాన్న కు ప్రేమ తో సినిమా సమయం వరకు కితాబు ఇస్తూ వచ్చాడు…ఇక తాజాగా వెంకీ సైతం ట్విటర్ వేదిక గా టాలీవుడ్ లో బెస్ట్ యాక్టర్ ఎవరైనా సరే తారక్ తరువాతే అని పోస్ట్ చెయ్యడంతో తారక్ అభిమానులు ఆనందంలో మునిగి తెలుస్తున్నారు. యంగ్ టైగర్ న మజాకా..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus