దిల్ రాజు ప్లానింగ్ లోనే ఉన్నాడు.. అక్కడ మొదలెట్టేశారు

తమిళ బ్లాక్ బస్టర్ హిట్ “96” సినిమా రీమేక్ రైట్స్ ను దిల్ రాజు కొనుక్కొని ఇంకా హీరో కోసం వెతుకులాటలోనే ఉండగా.. కన్నడ చిత్రసీమ అప్పుడే షూట్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతోంది. కన్నడలో ఈ చిత్రాన్ని గోల్డెన్ స్టార్ గణేష్, భావన ప్రధాన పాత్రల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కానీ… తెలుగులో మాత్రం హీరోయిన్ సంగతి పక్కన పెడితే.. హీరో ఎవరు అనేది కూడా ఫిక్స్ అవ్వలేదు. ఒప్పుకున్న కొంతమంది కూడా కథలో చిన్న చిన్న మార్పులు చెప్పడమో లేక క్లైమాక్స్ మొత్తాన్ని మార్చేయమని చెప్పడం లాంటివి చేస్తుండడంతో దిల్ రాజు ఈ ప్రోజెక్ట్ ను కదిలించలేక చాలా ఇబ్బందులుపడుతున్నాడు.

ఇదిలా ఉంటే.. 96 తమిళంలో విడుదలై అంత పెద్ద హిట్ అయినా కూడా ఇప్పటివరకూ హీరో విజయ్ సేతుపతికి పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదంట. ఈ విషయమై విజయ్ తమిళ ఫిలిమ్ ఛాంబర్ ను సంప్రదించాడట. ప్రస్తుతం దానికి సంబంధించిన రచ్చ జరుగుతోంది. సాధారణంగా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలు డబ్బులు ఎగ్గొడుతుంటారు. ఇక్కడ విచిత్రంగా హిట్ అయిన సినిమాకి కూడా డబ్బులు ఎగ్గొట్టడం గమనార్హం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus