Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

కామెడీ సినిమాలకి పెట్టింది పేరు అల్లరి నరేష్(Allari Naresh). కానీ తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని ‘గమ్యం’ ‘మహర్షి’ ‘నాంది’ వాట్ని సినిమాలతో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. కొన్నాళ్ళ నుండి అల్లరి నరేష్ కి సరైన హిట్టు లేదు. గతేడాది అల్లరి నరేష్ నుండి వచ్చిన ’12A రైల్వే కాలనీ’ డిజాస్టర్ అయ్యింది. దానికి ముందు ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ‘బచ్చల మల్లి’ కూడా ఫ్లాప్ అయ్యింది.

Allari Naresh

దీంతో అల్లరి నరేష్ మార్కెట్ మరింతగా డౌన్ అయ్యింది. దీంతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి అతనిది.ఈ క్రమంలో ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ‘ఆల్కహాల్’ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. దీంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టుకి కూడా అతను ఓకే చెప్పాడు. వివరాల్లోకి వెళితే… సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్ తో కలిసి ఓ క్రేజీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాని ‘సుందరకాండ’ ఫేమ్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించబోతున్నాడట.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఔట్ అండ్ ఔట్ ఫన్ తో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయని టాక్. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా విజయంతో సాహు మంచి ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే.

చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus