మంచి ఛాన్స్ కొట్టేసిన అల్లరి నరేష్ హీరోయిన్.. ఏకంగా బాలయ్య సినిమాలో..!

  • November 2, 2020 / 10:00 PM IST

నందమూరి బాలకృష్ణ నుండీ గతేడాది మూడు చిత్రాలు వచ్చాయి. ఆ మూడు కూడా దారుణ పరాజయాన్ని చవి చూశాయి. దాంతో ఇప్పుడు కచ్చితంగా హిట్టు కొట్టాలని బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు బాలయ్య. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించాయి. ఇప్పుడు రాబోతున్న చిత్రంతో కచ్చితంగా వీరిద్దరూ హ్యాట్రిక్ కంప్లీట్ చేస్తారని అభిమానులంతా ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో బాలయ్య డబుల్ రోల్లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అందుకు గాను ఓ హీరోయిన్ పాత్ర కోసం హీరోయిన్ పూర్ణ ను తీసుకున్నారట. గతంలో ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సీమటపాకాయ్’ ‘లడ్డూ బాబు’ వంటి చిత్రాల్లో నటించింది. ఇక విలక్షణ దర్శకుడు రఘుబాబు సినిమాల్లో అయితే ఈమె దాదాపు ఏదో ఒక రకంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇటీవల ఈమె పెళ్లి విషయమై చీటింగ్ కు గురైన సంగతి తెలిసిందే.

ఆ విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యింది పూర్ణ. అయితే దాని నుండీ త్వరగానే కోలుకుని ప్రస్తుతం ‘ఢీ’ షో లో మెంటర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. ఇలాంటి తరుణంలో ఈమెకు బాలయ్య సినిమాలో అవకాశం రావడం.. బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus