అల్లరోడు కూడా భయపెడతానంటున్నాడు!

  • May 11, 2016 / 11:41 AM IST

నాలుగేళ్ళ క్రితం విడుదలైన “సుడిగాడు” అనంతరం అల్లరి నరేష్ కెరీర్లో మరో హిట్టు లేదు. నటుడీగా 50 సినిమాల మైలురాయిని పూర్తి చేసుకొన్న అల్లరి నరేష్ కు అర్జెంటుగా ఒక సూపర్ హిట్ కావాలి. అందుకే.. తనకు “సీమాశాస్త్రి” లాంటి సూపర్ హిట్ ఇచ్చిన జి. నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం “సెల్ఫీ రాజా” అనే సినిమాలో నటిస్తున్న అల్లరి నరేష్.. నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసం “మా ఇంట్లో ఉంది దెయ్యం, నాకెందుకు భయం” అనే కామెడీ టైటిల్ ను రిజిష్టర్ చేయించాడు.

మరి ఈ సినిమాతోనైనా అల్లరోడు తన ఫ్లాపుల ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టి.. కామెడీ హీరోగా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతాడేమో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus