సినిమాను అనుకున్న బడ్జెట్ తో పూర్తిచేయించడమే కాదు.. ఆ మూవీని ప్రజలకు చేరువ చేసినప్పుడే నిర్మాత లాభాలను పొందగలడు. ఆ విషయాన్నీ ఎప్పుడో జీర్ణించుకున్న వ్యక్తి అల్లు అరవింద్. తన గీతా ఆర్ట్స్ బ్యానర్లో మినిమమ్ గ్యారంటీ కథలను ఎంచుకుంటూ, చక్కని ప్లాన్ అనుకున్నటైమ్ లో కంప్లీట్ చేసి, అనువైన సమయంలో రిలీజ్ చేసి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఎన్.వి.ప్రసాద్ తో కలిసి నిర్మించిన ధృవ మూవీ డిసెంబర్ 9 న రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
ఈ చిత్రం ప్రమోషన్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన అల్లు అరవింద్ చిత్రం రిలీజ్ విషయంలో పక్కా ప్లాన్ తో ఉన్నారు. ధృవ కు పోటీగా ఏ మూవీ రిలీజ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తమిళ హీరో సూర్య నటించిన సింగం 3 సినిమాను ఒక వారం వెనక్కు జరిపించారు. అలాగే కన్నడ పరిశ్రమలోనూ అల్లు ఆర్డర్ వేశారు. శుక్రవారం రిలీజ్ కి సిద్దమైన కన్నడ మూవీ ‘సుందరంగ జాణ’ను కూడా పోస్ట్ పోన్ చేయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో ధృవ ని ప్రదర్శించి భారీ కలక్షన్స్ రాబట్టేందుకు ప్లాన్ పూర్తిచేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.