‘అహం బ్రహ్మాస్మి’ పేరుతో రెండు కథలు

  • February 22, 2018 / 06:18 AM IST

సినిమాకి కథ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంత ముఖ్యం. ఇందుకు ఫిలిం ఛాంబర్ లో అనేక రూల్స్ ఉన్నప్పటికి గతంలో పేరు విషయంలో గొడవలు పడ్డ సంఘటనలు ఉన్నాయి. అదే తరహాలో ఒక టైటిల్ కోసం మెగా హీరోల మధ్య వార్ నడుస్తోంది. దర్శకుడు క్రిష్‌ “గౌతమీపుత్ర శాతకర్ణి” తర్వాత హిందీలో “మణికర్ణిక” మొదలుపెట్టారు. కంగనా రనౌత్‌ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి కథని రెడీ చేస్తున్నారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నా పేరు సూర్య చేస్తున్నారు. దీని తర్వాత ఈ మూవీ చేయనున్నారు. ఇందుకోసం “అహం బ్రహ్మాస్మి” అనే టైటిల్ అనుకుంటున్నారు.

కానీ ఇప్పుడు ఇదే టైటిల్ వరుణ్ తేజ్ కి అవసరమైంది. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి రీసెంట్ గా వరుణ్ తేజ్ కు ఓ కథ వినిపించి.. అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ ను సూచించారు. కథ, టైటిల్ రెండూ నచ్చాయి. తొలిప్రేమ విజయానందంలో ఉన్న వరుణ్ వెంటనే షూటింగ్ కి వెళదామని చెప్పారు. అయితే అహం బ్రహ్మాస్మి టైటిల్ ఇప్పటికే క్రిష్ రిజిస్టర్ చేయించారు. సో వరుణ్ తేజ్, అల్లు అర్జున్ మధ్య వార్ మొదలయింది. ఎవరు ఎవరికీ ఈ టైటిల్ ని త్యాగం చేస్తారో కొన్ని రోజుల్లో తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus