కొత్త స్టెప్పులను నేర్చుకుంటున్న అను, అల్లు అర్జున్

  • March 10, 2018 / 02:48 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో అదిరిపోయే ఫైట్స్ తో పాటు.. హుషారైన పాటలుంటాయి. ఆ పాటలకు కొత్త స్టెప్పులు, మూవ్ మెంట్స్ తప్పనిసరి. అభిమానులకు ఈ సారి కూడా బన్నీ సరికొత్త స్టెప్పులను పరిచయం చేయబోతున్నారు. రచయితగా హిట్స్ అందుకున్న వక్కంతం వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి.. దర్శకత్వం వహిస్తున్న చిత్రం “నా పేరు సూర్య”. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా కనిపించబోతున్నారు. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

రీసెంట్ గా నానక్ రామ్ గూడ లోని రామానాయుడు స్టుడియోస్ లో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఫైట్ సీక్వెన్స్ ను కంప్లీట్ చేశారు. ఇక కొన్ని సీన్లు, ఒక పాట మాత్రమే మిగిలి ఉంది. ఆ పాట కోసం నేషనల్ వైడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్‌, ఇంటర్నేషనల్ ఫేమ్ వీడియో ఆల్బమ్ మేకర్‌ను ప్రత్యేకంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ బృందంతో అర్జున్, అనులు ఏడెనిమిది రోజులు రిహార్సల్ చేస్తారు. తరవాత అమెరికా వెళ్లి పాట పూర్తి చేయనున్నారు. పాట మొత్తం అక్కడే షూటింగ్ చేస్తారు. షూటింగ్ మాత్రమే కాకుండా పాటకు సంబంధించిన పని అంతా అమెరికాలోనే పూర్తి చేయాలని ప్లాన్‌.బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ లు సంగీతమందిస్తున్న ఈ చిత్రం మే లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus