మెగా హీరో…అలా పడిపోయాడు!!!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు…అదే క్రమంలో ఆ ఫ్యామిలీ హీరోస్ తో సినిమా ఒక్కటి చేస్తే చాలు…మామోలు నేమ్ రాదు హీరోయిన్స్ కి. అందుకే ఆ హీరోలతో ఒక మంచి సినిమా చెయ్యాలి అని, ఒక్క అవకాశం, కనీసం గెస్ట్ రోలే, లేదంటే స్పెషల్ సాంగ్ ఇలా ఏ అవకాశం వచ్చినా వదలకుండా ఒకే చెప్పేస్తారు మన హీరోయిన్స్. అయితే ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవుతుంది మన అందాల భామా పూజా హెడ్గె.

ఇంతకీ ఈ భామా ఏం చేసింది అంటే…తాజాగా మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో “డీజె” అనే సినిమా అదే….దువ్వాడ జగన్నధం అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమా ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకముందే….ఆ సినిమాకు సంభందించి హీరోయిన్స్ విషయమై సర్చ్ మొదలు పెట్టారు చిత్ర యూనిట్. అయితే ఈ సంగతి తెలుసుకున్న మన బ్యూటీ “పూజా హెడ్గె” వెంటనే మన స్టైలిష్ స్టార్ ను అప్రోచ్ అయ్యిందట.

అంతేకాదు ఎలా అయినా ఈ అవకాశం తనకు ఇప్పించాల్సిందిగా మన బన్నీకి దాదాపుగా 12సార్లు ఫోన్ కూడా చేసిందని టాక్. ఇదిలా ఉంటే బాలీవుడ్ తాజా పిల్మ్ మొహంజోదారో చిత్రంలో నటించిన పూజా హెగ్డే అంటే తెలుగులో మంచి మార్కెట్ ఉంటుందని, అలాగే ఈ బ్యూటిని హీరోయిన్ గా పెట్టుకుంటే హిందీ రైట్స్ కి సైతం మంచి డిమాండ్ ఉంటుందని చిత్రయూనిట్ ఆలోచిస్తుంది. దర్శకుడు సైతం పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాడు. మరి ఇదే నిజం అయితే…పూజా పండగ చేసుకునేందుకు సిద్దం అయినట్లే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus