‘జెర్సీ’ చిత్రం పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్..!

  • April 20, 2019 / 01:18 PM IST

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న (నిన్న) విడుదలయ్యి మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నాని కెరీర్లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రమని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. ఇక జూ.ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కూడా ‘జెర్సీ’ చిత్రం అద్భుతమంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ లిస్ట్ లో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జాయినయ్యాడు. జెర్సీ చిత్రం అద్భుతమంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా ‘జెర్సీ’ చిత్రం పై స్పందిస్తూ ‘ఇప్పుడే ‘జెర్సీ’ చిత్రం చూసాను. చాలా హార్ట్ టచింగ్ గా అలాగే చాలా బ్రిలియన్ట్ గా అనిపించింది. ఈ చిత్రకథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. నాని చాలా గొప్పగా నటించావ్. నీ కెరీర్లో ఇది బెస్ట్ ఫిలిం.. బెస్ట్ పెర్ఫార్మన్స్. సహా నటీనటులు అలాగే టెక్నికల్ టీం కూడా అద్భుతంగా రాణించారు. చివరిగా… అలాగే ముఖ్యంగా .. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన తీరు అద్భుతం. ఎక్కడా దారి తప్పకుండా చాలా బాగా తెరకెక్కించాడు. చాలా మంచి సినిమా. సినీ ప్రేక్షకులందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది” అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus