స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే తన ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలెట్టనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్ ట్రై చేసే పనిలో ఉంటూనే.. తాను కొత్తగా ప్రారంభించిన ఆఫీస్ లో తాను స్వయంగా ప్రొడక్షన్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే.. తన తండ్రి, అన్నయ్య లాగా సినిమాల ప్రొడక్షన్ కాకుండా టీవి షోస్ ను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాడట అల్లు అర్జున్. ఈమేరకు కొన్ని మీటింగ్స్ కూడా అయ్యాయని, త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అయితే.. ఈ షోల నిర్మాణ విషయంలో అల్లు అర్జున్ కి ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా సపోర్ట్ ఇవ్వనుందట. ఈ ప్రొడక్షన్ వ్యవహారాల్లో ఆమె కూడా ఇన్వాల్వ్ కానుందని వినికిడి. ఆల్రెడీ ఆమె పికాబూ అనే ఫోటోస్టూడియోను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు ఈ ప్రొడక్షన్ కూడా ఆమె హ్యాండిల్ చేస్తుందని టాక్. మరి ఈ వార్తలో నిజమెంత అనేది వారి పి.ఆర్ టీం కన్ఫర్మ్ చేస్తుంది.