అల్లుఅర్జున్ కి.. అడ్డుపడుతున్న మెగాస్టార్..!

  • January 22, 2019 / 01:17 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా’ నరసింహ రెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది మెగాస్టార్ కు 151 వ చిత్రం. మరో పక్క అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ‘గీత ఆర్ట్స్’ మరియు ‘హారిక హాసినీ క్రియేషన్స్’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే సైరా చిత్రం తరువాత.. తన 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రం ఉగాది నుండీ మొదలు కానుందని తెలుస్తుంది. ‘సైరా’ చిత్రం చేస్తూనే మెగాస్టార్ ఈ చిత్రాన్ని కూడా చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇక బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం దసరా టైమ్ కు పూర్తవుతుంది. దసరాకే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు కూడా. అయితే ‘సైరా’ చిత్రం పూర్తయితే దసరాకే విడుదల విడుదల చేయాలని చిరు – చరణ్ లు బావిస్తున్నారట. దసరా సీజన్లో మంచి కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు… ఒక వేళ దసరాకి ఈ చిత్రం రాకపోతే బన్నీ హ్యాపీనే. ఒక వేళ ‘సైరా’ విడుదల చేద్దామనుకున్నా.. సంక్రాంతికి తన చిత్రాన్ని మార్చుకోవడానికి కూడా బన్నీ రెడీగానే ఉన్నాడు. అయినా కూడా బన్నీకి కష్టమే. ఎందుకంటే కొరటాల – మెగాస్టార్ చిత్రం ఏప్రిల్ లో మొదలు పెడితే 6 నెలల్లో కంప్లీట్ చేసేలా రెడీ అయిపోయాడట. అందులోనూ స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకుని 6 నెలల్లో పూర్తిచేయడం కొరటాలకి కొట్టిన పిండే..! ఇలా అనుకుంటే కొరటాల – చిరు చిత్రం సంక్రాంతికి విడుదల చేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి.

‘సైరా’ చిత్రం మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి.. ఒక వేళ దసరాకి మిస్సయినా సంక్రాంతికి తమ అభిమానులని అలరించేలా.. ప్లాన్ చేసుకున్నారట. ఇప్పుడు ఎక్కడా లేని టెన్షన్ అంతా అల్లు అర్జున్ కే వచ్చింది. అందులోనూ అల్లు అర్జున్ గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాలని ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చాలా మంది డైరెక్టర్ల కథలు వినడానికి 6 నెలలు టైం తీసుకుని త్రివిక్రమ్ ని లైన్లో పెట్టాడు. అల్లు అర్జున్ భారీ హిట్టు కొట్టాలంటే దసరా, సంక్రాంతి, సమ్మర్ ఈ మూడు సీజోన్లోనే సాధ్యమని చెప్పడంలో సందేహం లేదు. ఈ మూడు సీజన్లకి ఇప్పుడు మెగాస్టార్ అడ్డుపడటం అల్లు అర్జున్ ని తెగ కలవరపెడుతుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus