బన్నీని శృంగార పురుషుడని పిలిచిన పూనమ్ పాండే

ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా అందరితో పిలిపించుకున్న అల్లు అర్జున్ తొలి సారి సెక్సీ మ్యాన్ గా అభినందనలు అందుకున్నారు. ఇంతకీ బన్నీని హాట్ హీరోని చేసింది ఎవరో తెలుసా .. హాట్ మోడల్ పూనమ్ పాండే. 2011 లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా ఫోటోలకు ఫోజులిస్తానని ఈ భామ ప్రకటించి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. హాట్ ప్రకటనతో వెలుగులోకి వచ్చిన ఈ శృంగార తార బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో వేడి పుట్టించింది. తెలుగులో ‘మాలిని అండ్ కో’ అనే సినిమాతో యువతను మత్తెక్కించింది.

తాజాగా పూనమ్ పాండే మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వి.బి.ఆర్‌.క్రియేష‌న్స్‌, సూర‌జ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై పూన‌మ్ పాండే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న కొత్త చిత్రం హైద‌రాబాద్‌లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సందర్భం గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీపై విపరీతమైన ప్రేమను కురిపించింది. తెలుగు పరిశ్రమలోనే కాదు దక్షిణాది నటులందరిలో తనకి అల్లు అర్జున్ సెక్సీ గా కనిపిస్తాడని హాట్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈమె మాటలను వింటుంటే స్టైలిష్ స్టార్ కొత్త చిత్రం దువ్వాడ జగన్నాధం లో ఐటెం సాంగ్ కోసం బిస్కెట్ వేసినట్లు ఉందని కొంతమంది సినీ ప్రముఖులు భావిస్తున్నారు. మరి ఈ బిస్కెట్లకు బన్నీ ఆఫర్ ఇస్తాడో.. లేదో.. తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

https://www.youtube.com/watch?v=B3FbT75CMJ4

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus