తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు సుపరిచితుడు, స్టైలిష్ స్టార్ మరియు మోస్ట్ క్రేజీయస్ట్ హీరో అయిన అల్లు అర్జున్ కి స్టార్ డమ్ తోపాటు జాగ్రత్త కూడా ఎక్కువే అనిపిస్తోంది. సాధారణంగా అందరూ ఎంత వేగంగా వెళ్లడానికి కుదురుతుందా అని చూస్తుంటారు. ఎన్టీఆర్ రాష్ డ్రైవింగ్ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వింటూనే ఉంటాం. మంచు మనోజ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, నాగచైతన్య వంటి వాళ్ళందరూ బండ్లు స్పీడ్ గా నడపడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ.. అల్లు అర్జున్ మాత్రం తన బండికి స్పీడ్ లిమిట్ పెట్టించుకొన్నాడు.
బన్నీ ఎంతో ఇష్టపడి.. భారీ మొత్తం వెచ్చించి మరీ తయారు చేయించుకొన్న బీస్ట్ అనే క్యారీవ్యాన్ మొన్నటివరకు హాట్ టాపిక్. ఇప్పుడు మరోమారు ఆ వ్యాన్ వార్తల్లో నిలిచింది. అందుకు కారణం అల్లు అర్జున్ ఈ వ్యాన్ 80 స్పీడ్ దాటకుండా స్పీడ్ లాక్ చేయించడమే. ఈ విషయం ఆన్లైన్ లో ప్రాచుర్యం పొందడంతో బన్నీ ఫ్యాన్స్ అందరూ బన్నీ జాగ్రత్తను ఆకాశానికేత్తెస్తున్నారు. మరి బన్నీ పాటించిన జాగ్రత్తను ఆయన అభిమానులు కూడా ఫాలో అయితే బాగుండు.
1
2
3
4
5
6
7
8
‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?