హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా!

  • June 13, 2018 / 05:46 PM IST

టాలీవుడ్ లో స్టయిల్ అనగానే గుర్తుకు వచ్చే హీరో పేరు అల్లు అర్జున్. ఈ హీరో కు ఏకంగా స్టైలిష్ స్టార్ అని పిలుచుకుంటారు అభిమానులు సినిమాలోని ఏ పాత్ర లోనైనా తన దైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు బన్నీ. “జులాయి” సినిమాలో ఆకతాయి గా నటించినా “సన్ ఆఫ్ సత్య మూర్తిలో” లో హుందాగా వుండే పాత్రైన సరే ఎంతో బాగా నటించి అలరించాడు. అయితే ఈ సినిమాలు అన్ని అల్లుఅర్జున్ తో పాటు అటు నిర్మాతలకు ఇటు దర్శకులకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే.. ఈమధ్యకాలంలో సినిమాలు హిట్ అవుతున్నా కూడా పాపం అల్లు అర్జున్ కి మంచి పేరు రావడం లేదు. ఫైట్స్, డ్యాన్స్ కోసం మనోడు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఉండడం లేదు.

ఇదంతా తాను కేవలం బి, సి సెంటర్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తుండడం వల్ల వచ్చిన సమస్య అని అర్ధం చేసుకొన్న అల్లు అర్జున్ ఈసారి అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొనేందుకు ఒక క్లాస్ & మాస్ సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో రూపొందించేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి పారిస్ ట్రిప్ లో ఉన్న అల్లు అర్జున్ ఆ ట్రిప్ కంప్లీట్ అవ్వగానే విక్రమ్ కుమార్ సినిమా మొదలెడతాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus