భూమండలం మొత్తం మెచ్చుకొంది బన్నీ తప్ప.!

  • April 3, 2018 / 06:31 AM IST

రంగస్థలం” సినిమా విడుదలైనప్పట్నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రేక్షకుల, విమర్శకుల మన్ననలతో ఏ విధంగా దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. కలెక్షన్ల కంటే ఎక్కువగా ప్రశంసలే వచ్చాయి రామ్ చరణ్ & సుకుమార్ కి. నటుడిగా రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకొన్న ఈ చిత్రం సుకుమార్ కంటే ఎక్కువగా రామ్ చరణ్ కే ఎక్కువ పేరు తీసుకొచ్చింది. అందుకే అందరూ చరణ్ ని అభినందనలతో ముంచెత్తారు. ఆఖరికి నందమూరి కుటుంబానికి చెందిన ఎన్టీయార్ కూడా “అదరగొట్టావ్ చరణ్, నీకంటే బెటర్ గా ఆ రోల్ ఎవరూ చేయలేరు” అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశంసించాడు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలైన వరుణ్, సాయిధరమ్ తేజ్ లు కూడా చరణ్ పై తమ అభిమానాన్ని ఘనంగా చాటుకొన్నారు.

కానీ మెగా హీరోల్లో ముఖ్యుడైన, రామ్ చరణ్ కి స్వయానా బావ అయిన అల్లు అర్జున్ మాత్రం ఇప్పటివరకూ స్పందించలేదు. ఇప్పుడు మాత్రమే కాదు ఇంతకుమునుపు ఆడియో రిలీజ్, ట్రైలర్ రిలీజ్ కి కూడా బన్నీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ.. ఇప్పుడు సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ కనీసం ఒక ట్వీట్ వేయకపోవడం పట్ల ఒక సెక్షన్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. సినిమా చూశాడా, చూడలేదా అనే విషయం పక్కనపెడితే ఎట్ లీస్ట్ ఒక ఆల్ ది బెస్ట్ అనో లేక మరొక మెసేజ్ అయినా పెడితే బాగుండు. కానీ.. అల్లు అర్జున్ నుంచి అలాంటి రెస్పాన్స్ ఏమీ లేకపోవడంతో ఆల్రెడీ రెండు వర్గాలుగా విడిపోయిన మెగా అభిమానులు ఈ లేట్ కారణంగా ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus