అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయి అల్లు బాబి రెండో వివాహం నిన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. 2005లో తాను చేసుకొన్న వివాహ బంధంలో ఆనందంగా లేనని మూట్యువల్ ఇంట్రెస్ట్ మీద విడాకులు తీసుకొన్న బాబీ.. గత కొంత కాలంగా యోగా ట్రైనర్ నీలు షాతో డేటింగ్ చేస్తున్నాడు. విడాకులు మంజూరవ్వడంతోపాటు.. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో నిన్న అల్లు బాబీ-నీలుల వివాహం ఘనంగా జరిగింది.
అయితే.. ఈ వేడుకలో అల్లు కుటుంబం మొత్తం కనిపించారు ఒక్క అల్లు అర్జున్ తప్ప. దాంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అల్లు అర్జున్ కి తన అన్నయ్య బాబీ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే పెళ్లి వేడుకలో కనిపించలేదని వార్తలొచ్చాయి. అయితే.. అల్లు బాబీ చాలా డీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు.
“తాను సంతోషంగా కుటుంబ సభ్యుల అంగీకారంతోనే పెళ్లి చేసుకొన్నానని” సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మరి అల్లు అర్జున్ ఎందుకు హాజరవ్వలేదు, ఒకవేళ హాజరైనా ఫోటోలు బయటకి రాలేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.