అభిమానులకు మళ్ళీ క్లాస్ తీసుకున్న అల్లు అర్జున్

  • December 26, 2017 / 06:18 AM IST

సినీ వేడుకల్లో లక్షలాది మంది చూస్తుండగా.. పవన్ కళ్యాణ్ అభిమానులకు క్లాస్ తీసుకొని వివాదంలో ఇరుక్కున్న అల్లు అర్జున్ మళ్ళీ అదే రిపీట్ చేశారు. గతంలో చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బన్నీ.. ఒక మనసు ఆడియో వేడుకలో తన అభిమానులకు సైతం క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక్క క్షణం ఆడియో వేడుకలో పెద్ద ఎత్తున క్లాస్ పీకారు. అసలు విషయంలోకి వెళ్తే.. ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్క క్ష‌ణం’. ల‌వ్ వెర్స‌స్ డెస్టినీ అనేది ట్యాగ్ లైన్‌. అల్లు శిరీష్‌, సుర‌భి జంట‌గా న‌టించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుక నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ మైక్ అందుకోగానే అభిమానులు విజిల్స్ వేస్తూ అరవడంతో ఆయనకు కోపం వచ్చేసింది.

దీంతో స్పీచ్ ని పక్కనపెట్టేసి పెద్ద క్లాస్ తీసుకున్నాడు. “సంస్కారం అనేది చాలా ముఖ్యం. ఒకరు మాట్లాడేటప్పుడు వారిని మాట్లాడనివ్వాలి. అదే రెస్సెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్. ఆ సంస్కారం ఇవ్వకపోతే ఇంకెందుకు?” అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆవేశంతో ఊగిపోతూ “అభిమానులను పిలిచేది గోల చేసి వీలలు వేస్తారనే. కాని అలా కాకుండా ఎదుటివారు మాట్లాడినప్పుడు ఇబ్బందిపెట్టే విధంగా గోల చేయకూడదు. మీరు ఇలా అల్లరి చేస్తే కోపం వస్తుంది” అని చెప్పడంతో హాల్ మొత్తం నిశ్శబ్దం అయింది. ఇలా బన్నీ క్లాస్ తీసుకోవడంతో అభిమానులు తీవ్రంగా మండి పడుతున్నారు. స్టైలిష్ స్టార్ కి స్టైల్ బాగా పెరిగిపోయిందని సెటైర్ వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus